Site icon Prime9

Nirmala Sitharaman: కామారెడ్డి జిల్లాకలెక్టర్ పై నిర్మలాసీతారామన్ ఫైర్

Nirmala-Sitharaman-Fires-On-Collector

Kamareddy district: కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో రేషన్ షాప్ ను శుక్రవారం కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తనిఖీ చేసారు. ఈ సందర్బంగా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఎంత అని కలెక్టర్ ని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అడిగిన ప్రశ్నకు తనకి తెలియదని కలెక్టర్ సమాధానం చెప్పడంతో నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయి వుండి మీకు ఎలా తెలియదు అని ప్రశ్నించారు. అరగంట టైమ్ ఇస్తాను తెలుసుకొని చెప్పమని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తోంది కదా, ఈ విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రేషన్ షాపులో మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదంటూ కలెక్టర్ జితేష్ పటేల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుండి రేషన్‌ షాపులకు ప్రధాని మోదీ ఫ్లెక్సీలు కట్టాలని, ఒక వేళ మోదీ ఫ్లెక్సీ కట్టకపోతే, తానే సాయంత్రం వచ్చి మరీ ప్లెక్సీ కడతానని ఆమె అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేతలు నిర్మలాసీతారామన్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు యత్నించడంతో కాంగ్రెస్ నేతలను బీజేపీ లీడర్లు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి రెండు పార్టీల నేతలను అక్కడి నుంచి పంపించారు.

Exit mobile version