Naveen Murder: నగర శివారులో ఇటీవల జరిగిన నవీన్ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు నిందితుడిని పోలీసులు మరోసారి బయటకి తీసుకెళ్లారు. గతంలో నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
మరోసారి సీన్ రీకన్‌స్ట్రక్షన్.. (Naveen Murder)
పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడిని సీన్ రీకన్‌స్ట్రక్షన్ లో భాగంగా సంఘటన స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. సాయంత్రం మరోసారి బయటకు తీసుకువెళ్లారు. మలక్‌పేటలోని సలీంనగర్ లోని ఓ అపార్ట్‌మెంట్ కు తీసుకువెళ్లారు. ఫిబ్రవరి 17 నుంచి అర్ధరాత్రి హత్యజరిగే వరకు హరిహర తిరిగిన ప్రదేశాలకు పోలీసులు మరోసారి తీసుకెళ్లారు. ఈ కేసులో నవీన్ ని హత్య చేయడానికి ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమా? లేదా ఇంకేమైనా గొడవలున్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. హత్య చేసిన అనంతరం హరిహరకృష్ణ లొంగిపోయినప్పటికీ.. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో.. ఎవరైనా అతడికి సాయం చేశారా? అనే దిశలో ఆరా తీస్తున్నారు. ఇక ఈ హత్యపై హారిహార గర్ల్ ఫ్రెండ్ పాత్రపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆమె ప్రధాన పాత్రధారి అని అనేక ఆరోపణలు వచ్చాయి. ఇటీవల విచారణ సమయంలో ఆమె తీరుపై పోలీసులకు అనుమానం కలిగింది.
యువతి ప్రమేయంపై పోలీసుల కీలక వ్యాఖ్యలు..
నవీన్ హత్య విషయంలో యువతి ప్రమేయంపై పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఈ కేసులోకి లాగితే ఆత్మహత్య కూడా చేసుకుంటానని ఏకంగా పోలీసులనే బెదిరించినట్లు తెలుస్తుంది. అయితే పోలీసుల విచారణ కొత్త కావడమే ఆమె తీరుకు కారణమని తెలుస్తుంది. ఇప్పటికే ఆమెకు మూడుసార్లు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి విచారించగా.. స్పష్టమైన సమాధానాలు రాబట్టలేకపోయారని తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఆ యువతికి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. ఈ కేసు దర్యాప్తులో యువతి నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని విషయాలు రాబడతామని పోలీసులు అన్నారు.
ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడినే అత్యంత కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య అనంతరం నిందితుడు హరిహర కృష్ణ సైకోలా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్య అనంతరం పొట్ట మెుత్తం కోసి పేగులు బయటకు తీసినట్లు దర్యాప్తులో తేలింది.
పోలీసుల దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు..
ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. నవీన్‌ను హత్య చేసిన అనంతరం హరిహర కృష్ణ.. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. పోలీసుల విచారణలో నేరాన్నీ అంగికరించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్కరి ప్రమేయమే ఉందా.. ఇంకా ఎవరి పాత్రైన ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు. నవీన్‌ను హత్య చేసేందుకు.. హరి మూడు నెలల నుంచి ప్రణాళికతో వ్యవహరించాడు.ఈ హత్య చేసేందుకు.. రెండు నెలల క్రితమే కత్తిని కొనుగోలు చేశాడు. ఈనెల 17న పార్టీ చేసుకుందాం అని పిలిచి.. దారుణ హత్యకు హరికృష్ణ పాల్పడ్డాడు. మెుదట నవీన్ ను గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత సైకోలా మారి తల, మొండెం వేరు చేశాడు. గుండెను చీల్చి, మర్మాంగాలు కోసి ప్రియురాలికి పంపించాడు. పొట్ట మొత్తాన్ని కోసి పేగులను బయటకు తీసినట్టు పోలీసులు తెలిపారు. కత్తి పట్టుకునే ముందు హరి కృష్ణ గ్లౌజులు ధరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా.. ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ హత్య తీరును చూసి పోలీసులు విస్తుపోయారు.