Murder: అబ్దుల్లాపూర్ మెట్ లో యువకుడి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. స్నేహితుడి హత్య కేసులో ప్రధాన నిందితుడైన హరిహరకృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య ఒక్కడి వల్ల జరగలేదని.. దీని వెనక ఎవరో ఉన్నారని ఆరోపించారు. ఈ మేరకు నవీన్ తల్లిదండ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. (Murder)
ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడినే అత్యంత కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య తర్వాత నిందితుడు హరిహర కృష్ణ సైకోలా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్య అనంతరం పొట్ట మెుత్తం కోసి పేగులు బయటకు తీసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ హత్య విషయంలో.. ఒక్కరి ప్రమేయం ఉందా.. ఇంకా ఎవరి పాత్రైన ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ కు చెందిన నేనావత్ నవీన్ నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్నాడు. వీరిద్దరు ఇంటర్ లో స్నేహితులు.. వీరు ఒకే అమ్మాయిని ప్రేమించడంతో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 17వ తేదీన హరి దారుణంగా నవీన్‌ను హత్య చేశాడు. అనంతరం అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని గుట్టల్లో పడేశాడు.
మద్యం తాగి.. బైక్ పై తిరిగి
పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచి.. ఈ హత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ వచ్చిన నవీన్.. హరిహర కృష్ణతో కలిసి షికార్లు కొట్టాడు. సాయంత్రం తిరిగి వెళ్తానని.. నవీన చెప్పడంతో హరిహర వారించాడు. తాను కూడా వెంట వస్తానని నమ్మించి బైక్ పై తీసుకెళ్లాడు. హయత్‌నగర్ దాటాక మద్యం తీసుకొని.. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. రాత్రి సమయంలో అమ్మాయి ప్రస్తావన తీసుకొచ్చి హరిహర గొడవకు దిగాడు. ఇదే అదునుగా భావించి.. కత్తితో నవీన్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. చనిపోయాడని తెలుసుకుని.. తల, మెుండెం వేరు చేశాడు. నవీన్ కనిపించడం లేదని.. అతడు ప్రేమించిన అమ్మాయిని సంప్రదించగా.. తెలియదని సమాధానం ఇచ్చింది. హరిహరకృష్ణను సంప్రదించగా.. నవీన్‌ను అబ్దుల్లాపూర్‌మెట్ లో డ్రాప్ చేసినట్లు తెలిపారు. అక్కడికి ఇంకా రాలేదా అంటూ.. వారినే ప్రశ్నించాడు. నవీన్ తండ్రి శంకర్, మేనమామలకు ఈ విషయం తెలిసి.. హరిహరకృష్ణను సంప్రదించారు. ఇదే సమాధానం ఇచ్చాడు.
నిందితుడి నవీన్ కు కఠిన శిక్ష పడేలా చూస్తామని.. రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మహాత్మాగాంధీ వర్సిటీ హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న నవీన్ చదువుల్లో మెరుగ్గా ఉండే వాడని అక్కడి అధ్యాపకులు తెలిపారు. తోటి వారితోను నవీన్ ఎంతో ప్రేమగా ఉండేవాడని అక్కడి విద్యార్ధులు అన్నారు. శనివారం రాత్రి నవీన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. హరిహర అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు లొంగిపోయాడు. విచారణ అనంతరం.. నవీన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో శరీర భాగాలు వేరు వేరుగా పడి ఉన్నాయి.
ఈ హత్య గురించి పోలీసులు ఒళ్లు గగుర్లు పొడిచే విషయాలను వెల్లడించారు. నవీన్ ను దారుణంగా హత్య చేసిన అనంతరం హరి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసి విచారిస్తుండగా.. పోలీసుల ఎదుట హరి లొంగిపోయాడు. ఈ హత్యతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హరిహర కృష్ణ ఒక సైకో అని తెలుస్తోంది. నవీన్ ను కిరాతకంగా హత్య చేశాక ఈ విషయాన్ని ప్రేమించిన అమ్మాయికి ఫోన్ చేసి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయికి పంపిన మెసెజ్ దారుణంగా ఉంది. ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు అంటూ నవీన్ వేలును కోసి ఆ ఫొటో అమ్మాయికి పంపాడు. ఈ పెదాలే కదా నిన్ను తాకింది.. అంటూ పెదాలు కోసేశాడు. ఈ గుండెనే కదా నిన్ను తాకింది.. అంటూ నవీన్ గుండెను కోసి ఆ ఫొటోను కూడా పంపించాడు చేశాడు. చివరకు నవీన్ తలను కోసి దూరంగా పడేశాడు. ఆ తర్వాత నవీన్ మర్మాంగాన్ని కూడా కోసేశాడు. ఇవన్నీ చదివిన అమ్మాయి.. ఓకే వెరీ గుడ్ బాయ్ .. అంటూ సమాధానం ఇచ్చింది. నిందితురాలిగా హరి ప్రియురాలని సైతం ఇందులో చేర్చారు