Muthol: జాతీయ సమైక్యతా ర్యాలీని ప్రారంభించిన వెంటనే అర్ధాంతరంగా ఆగిన ఘటన ముధోల్ జిల్లాలో చోటుచేసుకొనింది. సమాచారం మేరకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆదేశాలతో అధికారులు జాతీయ సమైక్యతా ర్యాలీని చేపట్టారు. ఇందుకు డ్వాక్రా మహిళలు, విద్యార్ధులను ర్యాలీలో పాల్గొనే తరలించారు. అయితే కనీస ఏర్పాట్లలో విఫలం చెందారంటూ స్థానికులు, విచ్చేసిన మహిళలు తిరగబడ్డారు. ర్యాలీలో పాల్గొనకపోతే రూ. 500 ఫైన్ వేయడం ఏంటంటూ డ్వాక్రా మహిళలు ఆగ్రహం చెందడంతో అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే జాతీయ సమైక్యతా ర్యాలీని నిలిపివేసారు. అనంతరం అక్కడి నుండి అందరూ వెళ్లిపోయారు. మంత్రిగా, సీనియర్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన విఠల్ రెడ్డి సమైక్యతా ర్యాలీ నిర్వహించడంలో విఫలం చెందడాన్ని అందరూ చర్చించుకొన్నారు.