Mujra party: హైదరాబాద్ లో యువతులతో నగ్న నృత్యాలు చేయిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. పార్టీల పేరుతో అమ్మాయిల గలీజ్ దందాలోకి లాగి.. నిర్వాహకులు లాభాలను ఆర్జిస్తున్నారు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అధికంగా చోటు చేసుకుంటున్నాయి.
అమ్మాయిలతో నగ్న నృత్యాలు.. (Mujra party)
దేశవ్యాప్తంగా చిన్నారులు, అమ్మాయిలపై అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయిన కూడా పార్టీల పేరుతో వారితో గలీజ్ దందా చేయిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అధిక డబ్బు ఆశచూపి.. డ్రగ్స్ కి అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. కేటుగాళ్లు పోలీసుల కల్లు గప్పి.. యువతులతో నగ్నంగా డ్యాన్సులు చేయించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. అంతేగాకుండా..
గంజాయి మత్తుకు వారిని అలవాటు చేసి.. వారి జీవితాలలో ఆడుకుంటున్నారు. శని, ఆదివారాలు వస్తే చాలు వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
మత్తులో తను ఏం చేస్తుందో తెలియని అయోమయంలో తూగుతూ తన ఒంటిపై బట్టలు కూడా ఉన్నాయా? లేవా? అనేది కూడా మైమరిచిపోతున్నారు.
కొందరు ఇలాంటి వాటిని సొమ్ముచేసుకుంటుంటే మరికొందరు అమ్మాయిల మత్తులో పడి ఇలాంటి వాటిపై ఎడిక్ట్ అవుతున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాలలోని ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యక్రమాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్, వైజాగ్, రాజస్థాన్ ల నుండి అందమైన అమ్మాయి లను రప్పించి గలీజ్ దందాలను నిర్వహిస్తున్నారు.
ముజ్రా పార్టీ పేరుతో హంగామా సృష్టిస్తూ.. హుక్కా సేవిస్తూ సాప్ట్ వేర్ ఉద్యోగులు మత్తులో జోగుతున్నారు.
ఇలాంటి పార్టీ పేరుతో అమ్మాలయితో నగ్నంగా నృత్యాలు చేయిస్తున్నా వారిపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. దీంతో ఈఘటన నగరంలో కలకలం రేపింది.
మొయినాబాద్ పరిధిలో ఈ ముజ్రా పార్టీ గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలతో నగ్నంగా నృత్యాలు చేయిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫామ్ హౌస్ లపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో 8 లాడ్జీలు, 11 ఫామ్ హౌజ్ లు, 6 పబ్స్, 14 డాబాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.