Mp Komatireddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దుపై స్పందించారు. రాహుల్ గాంధీ సభ్యత్వ రద్దుకు ఒక్క రోజు ముందే ప్రధానితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్దమని ఈ సందర్భంగా వెంకటర్ రెడ్డి ప్రకటించారు.
అనర్హత వేటు వేయడం సరికాదు..
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దుపై స్పందించారు.
రాహుల్ గాంధీ సభ్యత్వ రద్దుకు ఒక్క రోజు ముందే ప్రధానితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్దమని ఈ సందర్భంగా వెంకటర్ రెడ్డి ప్రకటించారు.
రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికే ముప్పు అని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని అన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను పక్కదారి పట్టించడానికే.. రాహుల్ గాంధీపై వేటు వేశారని ఆరోపించారు.
అదానీ పై రాహుల్ ప్రశ్నించినందుకే ఇలా ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
అవసరమైతే.. ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కోమటిరెడ్డి తెలిపారు.
రాహుల్ పై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్‌లో ఆదివారం.. కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన పరిస్థితి కంటతడి పెట్టేలా ఉంది.. ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ వదులుకున్నారన్నారు.
అదానీ గురించి రాహుల్ ఎప్పుడు మాట్లాడారో.. అప్పటి నుంచి కుట్ర చేశారు. ఆగమేఘాల మీద పరువు నష్టం కేసు లో శిక్ష పడేలా చేశారు’’ అని కోమటిరెడ్డి ఆరోపించారు.
రాహుల్ పై అనర్హత వేటు ఎత్తేసే వరకు పోరాటం ఉధృతం చేయాలన్నారు. ఇందిరా గాంధీ పై వేటు వేస్తే ఏం జరిగిందో..ఇప్పుడు అదే జరుగుతుంది’’ ఎంపీ కోమటిరెడ్డి అన్నారు.