Site icon Prime9

MP Keshava rao: ప్రెస్ కౌన్సిల్ సభ్యత్వానికి ఎంపీ రాజీనామా

MP Kesha Rao resigns from membership of Press Council

MP Kesha Rao resigns from membership of Press Council

Hyderabad: రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ నేత కే. కేశవరావు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఈ మేరకు లేఖను మీడియా ముందుంచారు. తన సభ్యత్వాన్ని వదిలేస్తున్నట్లు ఇప్పటికే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కు తెలియచేసివున్నట్లు ఆయన తెలిపారు. వ్యక్తి గత కారణాలతోనే తాను రాజీనామా చేసిన్నట్లు లేఖలో కేశవరావు తెలిపారు. లేఖను రాజ్యసభ ఛైర్మన్ కు పంపించారు.

ఆయన పదవీకాలం 2024 అక్టోబర్ 5వతేది వరకు ఉంది. 2021 డిసెంబర్ 6న ఆయన సభ్యత్వాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృవీకరించింది. కౌన్సిల్ ఛైర్ పర్సన్ గా జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఉన్నారు. మొత్తం 28 మంది సభ్యులు కౌన్సిల్ లో ఉన్నారు. రాజ్య సభ హోదాలో రాఖేష్ సిన్హా, కేశవరావులు సభ్యులుగా ఉన్నారు. ఉన్నారు. ప్రచురించే వార్తలో ప్రధానమైన పెయిడ్ న్యూస్ పై కీలక అధ్యయనం చేసి నివేదికను కేశవరావు ప్రెస్ కౌన్సిల్ లో సమర్పించివున్నారు.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు తప్పు.. జగ్గారెడ్డి

Exit mobile version