Site icon Prime9

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటీషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ .. 3 వారాలకు విచారణ వాయిదా

cbi-once-again-issued-notices-to-mlc-kavitha under 91 CRPC

cbi-once-again-issued-notices-to-mlc-kavitha under 91 CRPC

MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ సమన్లు పంపడాన్ని సవాల్ చేస్తూ.. ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు ఈ కేసును ట్యాగ్‌ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

తీర్పుపై అందిరిలో ఉత్కంఠ.. (MLC Kavitha)

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ సమన్లు పంపడాన్ని సవాల్ చేస్తూ.. ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటీషన్ పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేయనుంది.

దిల్లీ లిక్కర్ కుంభకోణం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు సైతం నోటీసులు జారీ చేశారు.

తనకు నోటీసులు జారీ చేయడం పట్ల.. ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీం విచారణ చేయనుంది.

జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేది‌ల ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. ఇదే సమయంలో కవిత పిటిషన్‌పై ఇప్పటికే ఈడీ కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ కేసులో తమ వాదనకూడా వినాలని మార్చి 18న ఈడీ కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కవిత పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ కేసులో ఈడీ ఈనెల 11న ఎమ్మెల్సీ కవితను తొలిసారి ఈడీ విచారించింది. మరోసారి 16వ తేదీన హాజరు కావాలని తెలిపింది. కానీ ఆ సమయంలో కవిత హాజరు కాలేదు.

అయితే ఈ నెల 14న కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చట్టప్రకారం మహిళలను వారి ఇంటిదగ్గరే విచారించాల్సి ఉన్నప్పటికీ ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టు‌లో పిటీషన్ దాఖలు చేసింది.

కవిత పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు..

కవిత దాఖలు చేసిన పిటిషన్ లో అనేక విషయాలను ప్రస్తావించారు. తనకు ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత కోరింది.

తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కవిత కోరింది.

అధికార పార్టీ ఆదేశాల మేరకు ఈడీ నన్ను వేధిస్తోందని, నా విషయంలో ఈడీ చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపింది.

ఈ కేసు ఎఫ్‌ఐ‌ఆర్‌లో నా పేరు ఎక్కడ లేదని, కొద్దిమంది వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నన్ను ఈ కేసులో ఇరికించారని పేర్కొంది.

ఈడీ విచారణ భౌతికంగా, మానసికంగా ఇబ్బంది కలిగిస్తుందని కవిత పేర్కొన్నారు. తదుపరి విచారణ.. ఇంట్లో లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని కోరారు.

 

Exit mobile version