Site icon Prime9

MLC Jeevan Reddy: కవితను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఓడించారు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Jeevan Reddy

Jeevan Reddy

Hyderabad: గత లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత ఎంపీగా గెలిస్తే తమపై పెత్తనం చెలాయిస్తుందని భావించి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కలిసి వెన్నుపోటు పొడిచి ఆమెను లోక్ సభ ఎన్నికల్లో ఓడగొట్టారని జీవన్ రెడ్డి అన్నారు. కవిత గెలిస్తే తమ పై పెత్తనం చేస్తుందని వారు భావించారని అందుకే వారు ఓడగొట్టారని అన్నారు.

తమ పై కవిత ఆధిపత్యం చెలాయించకూడదంటే ఎంపీగా ఆమె ఓడిపోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావించారని, 30 వేలకు పైగా మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ పని చేశారన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీ కవితకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ లో లేకుంటే తమకు స్వేచ్ఛ, అధికారం వస్తాయని భావించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కవిత ఓటమికి కుట్ర చేశారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కవితకు ఈ విషయం తెలుసునని కానీ సొంత పార్టీ నేతల కుట్రల్ని కప్పి పుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కవిత పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలే ఆమెను ఓడించారని తెలిపారు.

Exit mobile version