Hyderabad: ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాల డీల్ పేరుతో శాసనసభ్యుల కొనుగోళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిన్నటిదినం పోలీసులకు పట్టుబడ్డ నిందుతులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ న్యాయమూర్తి ఆధారాలు లేవంటూ నిరాకరించారు. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
సైబరాబాద్ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం, ముగ్గురు నిందితులు 24 గంటల పాటు హైదరాబాద్‌ను విడిచి వెళ్లరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుల నివాస ప్రాంత వివరాలను పోలీసు కమిషనర్‌కు ఈరోజు సాయంత్రం 6లోపు తెలపాలని ఆదేశించింది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన రోహిత్‌రెడ్డితో పాటు సంబంధం ఉన్న ఇంకెవరితోనూ సంప్రదింపులు జరపవద్దని ఆదేశించింది. Operation Akarsh: ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్.. హైకోర్టుకు పోలీసులు
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా రూ. 400కోట్లతో 4గురు తెరాస శాసనసభ్యులను ప్రలోభాలకు గురిచేసే క్రమంలో ముగ్గురు వ్యక్తులు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఎంతమేర నగదు దొరికిందో సరైన సమాధానాలు కాని, వీడియోలుగాని పోలీసులు ఘటనా ప్రాంతంలో మీడియాకు చూపించలేకపోయారు.
ఇది కూడా చదవండి: Markets in profits: సెన్సెక్స్ 203 పాయింట్లు అప్…