MLA Seethakka: అధికార బలం, తాయిలాలు, హామీలు మాటున మునుగోడు ఉప ఎన్నికల్లో పలు పార్టీలు పోటా పోటీలు పడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు, ములుగు శాసనసభ్యురాలు ధనసారి అనసూయ (సీతక్క) మాత్రం తనదైన శైలిలో ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని చెప్పుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్న సీతక్కకు ఓ ఇంట దీపావళి సందడి కనపడకపోవడంతో ఆరా తీశారు. ఆ ఇంటి మహిళకు చేతినొప్పి కారణంగా దీపావళికి ఇంటిని ముస్తాబు చేయలేదన్న సంగతిని ఆమె గుర్తించారు. అంతే ఇంకేముంది, తనే స్వయంగా ఇంటి గుమ్మానికి పసుపు పూసి, కుంకమ పెట్టి ఏకంగా ఆ ఇంటి మహిళకు హారతి ఇచ్చి పండుగ శోభను తీసుకొచ్చారు. శుభాకాంక్షలను సీతక్క అందచేశారు. దీంతో అందరూ ఇలా కదా నేతలు ఉండాల్సింది అంటూ ఆమెను మనసారా అభినందించారు.
ఒక విధంగా గెలుపు ఓటములు అనేది ఏ ఎన్నికల్లోనైనా సహజం. కాని సీతక్క గత కరోనా సమయంలో కూడా పలువురు పేదలకు తానే స్వయంగా అన్న పానీయాలు, ఆహార పదార్ధాలు వారి చెంతకు చేర్చి అందరి ప్రశంసలు పొందింది. ఉప ఎన్నిక నేపధ్యంలో తానే స్వయంగా కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు అంటిస్తూ, రాహుల్ గాంధీని దీవించండి, కాంగ్రెస్ ఓటెయ్యండి, అభివృద్ధికి పట్టం కట్టండి అంటూ సీతక్క ముందుకు సాగిపోతున్నారు. ఏదిఏమైనా నేటి సమాజంలో ఇలాంటి నేతలు కరువనే చెప్పాలి.
ఇది కూడా చదవండి: Union Minister Kishan Reddy: తెరాస పార్టీ సంతలో పశువులను కొన్నట్లుగా నేతల్ని కొంటున్నారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి