Munugode: మునుగోడు ఉప ఎన్నికలో తెరాస నేతలు ట్విస్ట్ లు మీద ట్విస్టులు ఇస్తున్నారు. కోడి, మద్యం పంపిణీ చేసిన తెరాస నేతల ఘటన మరవకముందే ఏకంగా మంత్రి మల్లారెడ్డే స్వయంగా గ్లాసులో మద్యం పోసి తాగించిన యవ్వారం నెట్టింట హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్లితే, చౌటుప్పల్ మండలం, సైదాబాద్ గ్రామంలో మంత్రి మల్లా రెడ్డి ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చెందిన కొంతమంది ఓటర్లతో ఆయన సమావేశమైనారు.
ఆ సమయంలో మద్యం కావాలని మంత్రిని అక్కడున్న వారు కోరుకున్నారు. వెంటనే తన సిబ్బంది చేత మద్యం తెప్పించి, మల్లారెడ్డే స్వయంగా వారికి గ్లాసులో పోసి మరీ తాపించాడు. దీన్ని చాటుగా తీసిన ఫోటో కాస్తా సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యమైంది. ఇంకేముంది చెప్పాలా.. అధికార పార్టీ తీరును ప్రతిపక్షాలు ఎండిగడితే, మంత్రే స్వయంగా బాబ్బాబు అంటూ వివరణ ఇచ్చుకొనే పరిస్ధితికి వచ్చింది.
మద్యం పంపిణీపై టీపీసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను, ఓటర్లను మద్యంతో ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. విస్కీ తాగుతూ, తాపించడం వంటి చేష్టలతో మంత్రిగా ఉండే అర్హత లేదని వ్యాఖ్యానించారు. భాజపా డబ్బును నమ్ముకొని, తెరాస లిక్కర్ ను నమ్ముకొని ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనారని, కాంగ్రెస్ మాత్రమే ఓటర్లు, కార్యకర్తలను నమ్ముకొని ఎన్నికలకు వెళ్లుతుందిన ఆయన పేర్కొన్నారు. కేసిఆర్ క్యాబినెట్ లో మద్యం బానిసలు, పేకాట బానిసలు ఉన్నారని విమర్శించారు.
మంత్రి మల్లా రెడ్డి వివరణ ఇచ్చుకొనే పరిస్ధితికి మద్యం ఘటన దారి తీసింది. మద్యం పోసింది వాస్తవమేనని, అయితే తన బంధువులకు పోసిన సమయంలోని వీడియోను వైరల్ చేసారంటూ పేర్కొన్నారు. మందు పోస్తే తప్పులేదని కూడా వ్యాఖ్యానించారు. తాగిన వారిలో ఆయన పాలేర్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. సమాజంలో హోదాతో పాటు అధికారంలో ఉన్న కీలకమైన వ్యక్తే ఇలాంటి ఘటనలకు పాల్పొడితే ఎలానంటూ, నెట్టింట వైరల్ అవుతున్న ట్రోల్స్, కామెంట్లు మాత్రం ఆగలేదు.
ఇది కూడా చదవండి: కేసిఆర్ అవినీతి మీటరుకు లెక్క తేల్చేది మునుగోడు ప్రజలే…కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి