Site icon Prime9

Minister KTR : హైదరాబాద్‌ లో స్టీల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌.. దాదాపు 450 కోట్లతో !

Minister KTR open new steel bridge in hyderabad

Minister KTR open new steel bridge in hyderabad

Minister KTR : హైదరాబాద్‌ నగరంలో తాజాగా మరో వంతెన ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందిరాపార్క్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడు మీదుగా వీఎస్‌టీ వరకు స్టీల్ బ్రిడ్జిని నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ బ్రిడ్జిని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ (Minister KTR) ప్రారంభోత్సవం చేశారు. 2.25 కిలోమీటర్లు ఉన్న ఈ ఫోర్ లైన్ స్టీల్‌ బ్రిడ్జికి.. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి నామకరణం చేశారు. కాగా ఈ వంతెన నిర్మాణానికి దాదాపు 450 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు తెలుస్తుంది. అలానే  ఈ బ్రిడ్జి నిర్మాణానికి 12, 500 మెట్రిక్ టన్నుల స్టీల్ ను, 20 మెట్రిక్‌ టన్నుల ఉక్కును ఉపయోగించారు. అంతేకాదు 20 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వినియోగించారు.ఫ్లైఓవర్ లో మొత్తం 81 స్టీల్ పిల్లర్లు, 46 పైల్ ఫౌండేషన్స్ ఏర్పాటు చేశారు. నాలుగు వరుసలలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం సాగింది.

2020 జూలై 10న ఈ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయగా నేడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు దీని ఫలితంగా వీఎస్‌టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. స్టీల్ బ్రిడ్జి నిర్మించిన మార్గంలో రోజు లక్ష వాహనాలు నడుస్తూ ఉంటాయి. సాధారణంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీద నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వెైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీ వరకు 5 నిమిషాల్లో వెళ్లొచ్చని చెబుతున్నారు. దాంతో వాహనాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

 

మొత్తంగా ఎస్‌ఆర్‌డీపీలో 48 ప్రాజెక్టులు చేపట్టగా.. ఇప్పటి వరకు 35 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఈ ఫ్లై ఓవర్‌కు దాదాపు  దక్షిణాదిన మొదటి పొడవైన వంతెన ఇది కావడం గమనార్హం. అంతే కాకుండా జీహెచ్‌ఎంసీ చరిత్రలో భూసేకరణ లే కుండానే నిర్మాణం చేపట్టిన మొదటి ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం. అదే విధంగా హైదరాబాద్‌లో మైట్రో రైల్‌ మార్గం మీదుగా నిర్మించిన ఫ్లై ఓవర్‌ కూడా ఇదే కావడం మరో విశేషం.

Exit mobile version