Site icon Prime9

Meridian Restaurant : హైదరాబాద్ లో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు రెస్టారెంట్ సిబ్బంది దాడి.. చికిత్స పొందుతూ కస్టమర్ మృతి

meridian restaurant staff attack on customer and died due to asking extra curd

meridian restaurant staff attack on customer and died due to asking extra curd

Meridian Restaurant : హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు కస్టమర్ మీద పంజాగుట్ట మెరిడియన్ రెస్టారెంట్ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో కస్టమర్ మృతి చెందారు. ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పెరుగు అడిగినందుకే దాడి చేస్తారా అంటూ ఆ హోటల్ ను సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన లియాకత్‌.. ఆదివారం రాత్రి పంజాగుట్ట లోని మెరిడియన్‌ హోటల్‌కు బిర్యానీ తినేందుకు వచ్చాడు. తనకు ఎక్స్ ట్రా పెరుగు కావాలని సిబ్బందిని అడిగాడు. ఈ క్రమంలో సిబ్బందికి, లియాకత్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత లియాకత్‌పై సిబ్బంది దాడికి దిగారు. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు హోటల్‌కు చేరుకుని ఇరు వర్గాలను పోలీస్‌స్టేషన్‌ తీసుకువచ్చి మాట్లాడుతుండగానే.. కొద్దిసేపటికే లియాకత్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Meridian Restaurant

 

అయితే పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడి జరిగిన తర్వాత బాధితుడిని ఆసుపత్రికి తరలించకుండా పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడంతో చికిత్స అందడంలో జాప్యం జరిగి లియాకత్‌ మృతి చెందాడని అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్‌ బేగ్‌ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని మృతి చెందిన లియాకత్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. దాడికి పాల్పడిన హోటల్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది.

 

Exit mobile version
Skip to toolbar