Jubliehills: హైదరాబాద్ లో ఓ దొంగ రెచ్చిపోయాడు. క్యాబ్ బుక్ చేసుకొని మరి రూ. 10 లక్షలు దోచుకెళ్లాడు. ఇంట్లో ఉన్న గర్భిణి మెడపై కత్తిపెట్టి బెదిరించి నగదు దోచుకెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
క్యాబ్ లో వచ్చి.. నగదు దోచుకెళ్లి
హైదరాబాద్ లో ఓ దొంగ రెచ్చిపోయాడు. క్యాబ్ బుక్ చేసుకొని మరి రూ. 10 లక్షలు దోచుకెళ్లాడు. ఇంట్లో ఉన్న గర్భిణి మెడపై కత్తిపెట్టి బెదిరించి నగదు దోచుకెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరిగింది. ఏపీ లోని భీమవరంకు చెందిన వ్యాపారి ఇంట్లో ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. నాకు బంగారం వద్దు.. డబ్బులే కావాలి అంటూ ఆరు గంటలకు పైగా ఇంట్లోనే ఉండి గర్భిణిని బెదిరించాడు. భీమవరం ప్రాంతానికి చెందిన ఎన్‌ఎస్‌ఎన్ రాజు తల్లి, భార్య, ఎనిమిది నెలల గర్భిణి అయిన కుమార్తెతో జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 52లో నివసిస్తున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున ఓ ఆగంతుకుడు ఎవరికి తెలియకుండా.. మెుదటి అంతస్తులోకి వెళ్లి కిటికీ గుండా లోపలికి ప్రవేశించాడు. నిద్రిస్తున్న గర్భిణిపై.. కత్తి పెట్టి బెదిరించాడు. ఆమె ఒంటిపై ఉన్న వజ్రాల చెవిదిద్దులు, దాదాపు అరకిలో బంగారు ఆభరణాలు ఇస్తానని చెప్పినా వినలేదు. రూ.20 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు.
ఇది గమనించిన.. తల్లి ఆందోళనకు గురయ్యారు. నగదుకు బదులు డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో.. రూ. 2 లక్షలు ఇచ్చారు. మరో రూ. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. స్నేహితుడి సాయంతో పంపించారు. అనంతరం.. నిందితుడు షాద్‌నగర్‌కు ఓలా క్యాబ్ బుక్ చేసుకొని ఆగంతుకుడు వెళ్లిపోయాడు. తేరుకున్న కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేశారు.