Site icon Prime9

Mahabubnagar student: నాలుగు నెలల క్రితం అమెరికా వెళ్లి.. అంతలోనే

Mahabubnagar student

Mahabubnagar student

Mahabubnagar student: అమెరికాలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన మరో విద్యార్థి మృతి చెందాడు. మంగళవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్ మండలం కప్పెట గ్రామానికి చెందిన బోయ మహేష్ (24) మృత్యువాత పడ్డాడు.

నాలుగు నెలల క్రితమే(Mahabubnagar student)

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బోయ శకుంతల, వెంకట్ రాములు కుమారుడు మహేష్ బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం నాలుగు నెలల క్రితం అమెరికా వెళ్ళాడు. అక్కడ కాంకోర్డియా యూనివర్శిటీలో ఎంఎస్‌ చేస్తున్నాడు. మంగళవారం రాత్రి ముగ్గురు ఫ్రెండ్స్ శివ, శ్రీలక్ష్మి, భరత్‌తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన వాళ్లు తీవ్రంగా గాయపడ్డారు.

 

గ్రామంలో విషాద ఛాయలు

కాగా, మహేష్ తండ్రి వెంకట్ రాములు మహారాష్ట్రలో ఓ కాంట్రాక్టర్‌ వద్ద సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. చేతికొచ్చిన కుమారుడు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కప్పెట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మహేశ్‌ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

Exit mobile version