Site icon Prime9

IT Raids : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ళు, కార్యాలయాల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు..

latest news about it raids on brs mlas

latest news about it raids on brs mlas

IT Raids : హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ళు, కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీ లోని శేఖర్ రెడ్డి నివాసం, మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేట్‌లోని కార్పొరేట్ ఆఫీసు, జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, కొత్తూరు పైపుల కంపెనీ కార్యాలయాలలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఏక కాలంలో ఒడిశా, ఢిల్లీకి చెందిన 70 మందితో కూడిన ఐటీ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా మరోవైపు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితా రెడ్డిని ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారని సమాచారం అందుతుంది. శేఖర్ రెడ్డి పలు రియల్ ఏస్టేట్ సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్టుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. అదే విధంగా ఈ ఐటి సోదాలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని నైతికంగా దెబ్బతీసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐటీ సోదాలు చేయిస్తోందంటూ నేతలు ఆరోపిస్తున్నారు.

Exit mobile version