Site icon Prime9

Ice Cream Plant: తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ కంపెనీ

ice cream

ice cream

 India’s largest ice-cream manufacturing Unit: దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీ తెలంగాణలోని జహీరాబాద్‌లో ప్రారంభమయిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో జ‌రుగుతున్న శ్వేత విప్ల‌వానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. ఈ యూనిట్ లో ప్ర‌సిద్ధి గాంచిన‌ అరుణ్ ఐస్ క్రీమ్స్, ఐబాకో జ‌హీరాబాద్‌లో ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు ఆయన ట్విట్టర్ లో తెలిపారు.

హట్సన్ కంపెనీకి చెందిన అరుణ్ బ్రాండ్ ఐస్ క్రీములు తయారు చేసే ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ఉత్పత్తి ప్రారంభించింది. హ‌ట్స‌న్ కంపెనీ ద్వారా రోజుకు 7 ట‌న్నుల చాకోలెట్స్, 100 ట‌న్నుల ఐస్‌క్రీంను ప్రాసెస్ చేసే ప్లాంట్ల ప్రారంభోత్స‌వం జరిగింది. . ఇండియాలో ఐస్ క్రీమ్స్ కు పుట్టినిల్లుగా జ‌హీరాబాద్ నిలిచింది. తెలంగాణలో జ‌రుగుతున్న శ్వేత విప్ల‌వానికి ఇది నిద‌ర్శ‌న‌ం. ఈ యూనిట్ లో ప్ర‌సిద్ధి గాంచిన‌ అరుణ్ ఐస్ క్రీమ్స్, ఐబాకో జ‌హీరాబాద్‌లో ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు కేటీఆర్ ట్వీట్ చేసారు. హట్సన్ సంస్ద ప్ర‌తి రోజు 10 ల‌క్ష‌ల లీట‌ర్ల పాల‌ను కొనుగోలు చేస్తుంద‌ని, దీని వ‌ల్ల 5 వేల మంది పాడి రైతులు లాభం పొందుతున్నార‌ని,1500 మందికి ఉపాధి కూడా ల‌భిస్తుంద‌ని కేటీఆర్ తెలిపారు.

Exit mobile version