Site icon Prime9

Minister KTR: ప్రధాని మోదీకి కేటిఆర్ బహిరంగ లేఖ

KTR's open letter to PM Modi

KTR's open letter to PM Modi

Hyderabad: దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ రాశారు. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడని, రోజ్ గార్ మేళాతో తెలిసివచ్చిందన్నారు. మేళాను పచ్చి దగాగా పేర్కొన్నారు. యువతను మోసం చేయడం ఇదేం కొత్తకాదని మరోసారిగా తెలిపారు. మోసపు హామీలు పక్కన పెట్టి నిబద్ధతతో నిరుద్యోగ సమస్య పై దృష్టి పెట్టాలని ప్రధానికి కేటిఆర్ సూచించారు.

ఏటా 2కోట్ల మంది ఉద్యోగాల సంగతి ఏంటని ప్రశ్నించారు. గడిచిన 8ఏళ్లకు సంబంధించి 16 కోట్ల ఉద్యోగాల పై శ్వేత పత్రం విడుదల చేయగలరా అంటూ ప్రశ్నించారు. ఏటా 50వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయని కేంద్ర ప్రభుత్వం, మేళా పేరుతో 75 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని యువత గమనిస్తోందన్నారు. అధికార పార్టీపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉందని ప్రధాని మోదీ పై కేటిఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు.

ఇది కూడా చదవండి: Rishi Sunak: భారతదేశం నేర్చుకోవలసిన పాఠం.. రిషి సునక్ యూకే ప్రధాని కావడం పై ప్రతిపక్ష నేతలు

Exit mobile version