KTR: రాష్ట్రంలో కొందరు అధికారం కోసం బిచ్చగాళ్లలా అడుక్కుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. భాజపా, కాంగ్రెస్ పై కేటీఆర్ మండిపడ్డారు.
అడుక్కుంటున్నారు.. (KTR)
రాష్ట్రంలో కొందరు అధికారం కోసం బిచ్చగాళ్లలా అడుక్కుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. భాజపా, కాంగ్రెస్ పై కేటీఆర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ను ఎంపీగా గెలిపించిన పాలమూరు ప్రజలకు రుణపడి ఉంటానని కేటీఆర్ అన్నారు. పాలమూరు బిడ్డల ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు.
కేసీఆర్ అంటే అర్ధం ఇదే..
కేసీఆర్ అనే పదానికి కేటీఆర్ కొత్త అర్ధం చెప్పారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని చెప్పారు. అధికారంలోకి వచ్చాకా.. పాలమూరు జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంలో ఎక్కడా కూడా తాగు, సాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. ఒకప్పుడు వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు.. నేడు పంటపొలాలతో సస్యశ్యామలంగా మారిందని అన్నారు. నూతన సచివాలయంలో.. మెుదటి సమీక్ష పాలమూరు జిల్లా గురించే జరిగిందని అన్నారు.
భాజపా కు కౌంటర్..
ఈ సభలో మాట్లాడుతూ కేటీఆర్ భాజపాపై విమర్శలు చేశారు. బీజేపీకి ఎన్నికల సమయంలోనే దేవుళ్ళు గుర్తుకొస్తారు. దేవుళ్ళ పేరుతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్‌కు జాతీయ హోదా కల్పిస్తామన్న ప్రధాని హామీ ఏమైంది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చూస్తే ప్రతిపక్షాలకు నోట్లో మాట రావడం లేదు.
సీఎం వయసు స్థాయి చూడకుండా రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి మాటలు పట్టించుకోనవసరం లేదు.
అభివృద్ధి జరుగుతుంటే విమర్శలు వస్తూనే ఉంటాయి. సవాళ్లను దాటుకొని ముందుకు సాగాలని కేటీఆర్ అన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేటీఆర్.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేయనున్న అమరరాజా సంస్థకు చెందిన గిగా కారిడార్‌కు కేటీఆర్ భూమి పూజ చేశారు.