Hyderabad: అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్షాన్ని బలహీన పరిచారని ఫైరయ్యారు. నియోజక వర్గ అభివృద్ది కోసం పార్టీకి రాజీనామా చేశానని, పదవుల కోసం కాదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు నియోకవర్గ అభివృద్ది గురించి మాట్లాడి అలసిపోయానని, అందుకే ముందుస్తుకు వచ్చానని తెలిపారు. రాష్ట్ర అభివృద్దిని పట్టించుకోని కేసీఆర్ దేశ రాజకీయాలు అంటూ బయలుదేరారని ఎద్దేవా చేశారు.
అదే విధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బడా వ్యాపారస్తులను బెదిరించి కోట్లు దండుకున్న వ్యక్తి రేవంత్ అన్నారు. ఆర్టీఐను అడ్డుపెట్టుకుని సంపాదించిన డబ్బుతో టీపీసీసీని కొనుక్కున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చరిత్ర మొత్తం తెలుసునని అన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుకున్ను చరిత్ర ఆయనదని, ప్రజా సంక్షేమం కోసం రాజీనామా చేసిన చరిత్ర తనదని అన్నారు.