Komatireddy Rajagopal Reddy: రెండు మూడు రోజులుగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారనేది ఈ వార్త సారాంశం. అయితే తాజాగా దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఇలాంటి దుష్ర్పచారాలను ఎవరు నమ్మవద్దని సూచించారు.
రెండు మూడు రోజులుగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారనేది ఈ వార్త సారాంశం. అయితే తాజాగా దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఇలాంటి దుష్ర్పచారాలను ఎవరు నమ్మవద్దని సూచించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. భాజపాను బలహీనపర్చడానికే కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
తనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై కోమటిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తాను కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్తలను ఖండించారు. అలాంటి వార్తలను ఎవరు నమ్మవద్దని తెలిపారు. తాను భాజపాలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.
కర్ణాటక ఫలితాలు అనంతరం.. తన అనుచరులు తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని అడుగుతున్నారని కోమటిరెడ్డి అన్నారు. భాజపాను వీడుతున్నట్లు కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయి. అవి నిజం కాదన్నారు. మేం ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే ఉన్నామని.. రేవంత్ లాంటి వాళ్లు మెున్న వచ్చారని అన్నారు. అలాంటి వారి నాయకత్వంలో ఎలా పనిచేయాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.
రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. తాను భాజపాకు అమ్మడుపోయినట్లు ప్రచారం చేశారు. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అప్పులపాలైన తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం మోదీ, అమిత్‌షా నాయకత్వంలోని భాజపాకే సాధ్యమని ఈ సందర్భంగా అన్నారు.