CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని.. తొలిసారిగా నూతన సచివాలయంలో నిర్వహిస్తారు. ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కీలక సమావేశం..
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని.. తొలిసారిగా నూతన సచివాలయంలో నిర్వహిస్తారు. ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నూతన సచివాలయంలో కేసీఆర్ తొలిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే దాని ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉంటుందో అనేదానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. చివరిసారిగా ఫిబ్రవరి 5న కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో.. బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు 4 కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం రుణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ సమావేశమైన ప్రతిసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని ఇప్పటికే పలుసార్లు కేసీఆర్ స్పష్టం చేశారు.