Site icon Prime9

DK Aruna: బీజేపీని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదు.. డీకే అరుణ

DK Aruna

DK Aruna

Hyderabad: మీ ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చారో? ఇంకా దేనికి వచ్చారో ఇప్పటి వరకు మీకే క్లారిటీ లేదంటూ బీజేపీ నేత డీకే అరుణ టీఆర్ఎస్ నేతల పై మండిపడ్డారు. అయితే దీనిపై
కేసీఆర్ కు మాత్రం చాలా క్లారిటీ ఉందని ఎందుకంటే ఇదంతా చేయించింది ఆయనే అని అన్నారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే నవ్వాలో, ఏడవాలో తెలియడంలేదన్నారు.

దళితులంటే చాలా గౌరవమన్నారు. మరి కొప్పుల ఈశ్వర్ ను ఎందుకు సమావేశం నుంచి పక్కకు పంపించారని అడిగారు. దళిత వ్యక్తులు, ఎమ్మెల్యేలంటే కనీస గౌరవం లేదు. వారికే కాదు ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా విలువ లేదు. ఫాంహౌజ్ లోని నలుగురు ఎమ్మెల్యేలను మాత్రం వెంటే పెట్టుకుని తిరుగుతున్నారు. ఇదేనా ప్రజాస్వామం, స్వేచ్ఛ? ఇదంతా డ్రామా అని ప్రతి ఒక్కరికీ అర్థమైందని, బీజేపీని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదని అరుణ విరుచుకుపడ్డారు. నువ్వెన్ని లక్షల కోట్లు సంపాదించావో, గతంలో నీ కుటుంబం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడెలా సంపాదించావు ? అంటూ ప్రశ్నించారు.

ప్రజలు మీకు భయపడి, అహంకారానికి గురై సైలెంట్ గా ఉండొచ్చు. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు మీరు కొనుక్కున్న వారే ఉన్నారు. మీరు కొంటే తప్పులేదు. మేము రాజీనామా చేయించి గెలిస్తే అప్రజాస్వామ్యమా? ఆడియోలో ఏముందో, వీడియోలో కూడా అదే ఉంది. ప్రధాని మోదీ నీలాగ మోసపు మాటలు మాట్లాడలేదు. నువ్వు ఇచ్చిన హామీల వీడియోలు ఒకసారి చూడు అంటూ అరుణ కేసీఆర్ ని ఎద్దేవా చేసారు.

Exit mobile version