Site icon Prime9

CM KCR: రూ.100 కోట్లతో విమానం కొన్న కేసీఆర్..

kcr flight

kcr flight

Hyderabad: ఇంటగెలిచి రచ్చ గెలవమన్న సామెత ఉంది. దీనిని కేసీఆర్ నిజం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండు సార్లు సీఎం అయ్యారు. అంటే ఇంట గెలిచారు. దీనితో గులాబీ సారు ఇక ఢిల్లీ పై దృష్టి సారించారు. జాతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాల్లో ప్రవేశించాలని బీజేపీకి తన తడాఖా చూపెట్టాలని డిసైడయ్యారు. దీని కోసం గత కొద్దిరోజులుగా వివిధ రాజకీయపార్టీల నేతలు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చిస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోను సిద్దం చేస్తున్నారు. అక్టోబర్ 5న విజయదశమినాడు జాతీయ పార్టీ పేరు ప్రకటించబోతున్నారని సమాచారం.

జాతీయపార్టీ పెట్టాక మరి అన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటించవలసి ఉంటుంది. దీనికోసం కేసీఆర్ రూ.100 కోట్లతో విమానాన్ని కూడ కొనుగోలు చేసారు. 12 సీట్లతో ఉన్న ఉన్న ఈ చార్టెడ్ ఫ్లైట్ ను కొనుగోలు చేయడానికి టీఆర్ఎస్ నేతలు ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు, ఒకరు నల్గొండ, మరొకరు కరీంనగర్ జిల్లా చెందిన నేతలు ఇందుకు సంబంధించిన ఖర్చులు భరించారు. ఈ లెక్కన ఐదుగురు తలా 20 కోట్లు ఇచ్చినట్టు భోగట్టా. మరోవైపు కేసీఆర్ విమానం కొనుగోలు పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు.

దేశదిమ్మరిలా తిరగడానికి.. రేవంత్ రెడ్డి 

అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏ నాడు పరామర్శించ లేదు. ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు. ఫాంహౌస్ దాటింది లేదు. ఇప్పుడు దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట. ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ. ఇన్నేళ్ల తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలను ఏ రోజూ కలవలేదని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఏ నాడూ పరామర్శించలేదు అంటూ విమర్శించారు. ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు. ఫాంహౌస్ దాటింది లేదు, ఇప్పుడేమో దేశ దిమ్శరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట! ఎవని పాలయ్యిందిరో తెలంగాణ..!! అంటూ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Exit mobile version
Skip to toolbar