Site icon Prime9

Kishan Reddy: ప్రధాని పర్యటనలో వ్యతిరేక ఫ్లెక్సీలు విచారకరం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

It is regrettable that flexes were formed against the Prime Minister during his visit

Hyderabad: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటనలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఏర్పాటు చేయడం విచారకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపటిదినం ప్రధాని రామగుండం రానున్న క్రమంలో కిషన్ రెడ్డి భాజపా కార్యాలయంలో మీడియాతో సమావేశమైనారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. తెలంగాణలో అసలైన రాజకీయ ఆట ఇప్పుడే ప్రారంభమైందన్నారు. సీఎం కేసిఆర్ ను వదిలే ప్రసక్తిలేదన్నారు. ఇచ్చిన హామీల పై నిలదీస్తామన్నారు. మహిళా గవర్నర్ ను తెరాస సర్కారు పదే పదే అవమానించటాన్ని ఖండిస్తున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ దాడులతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రధాని పర్యటనకు ఆహ్వానం పలుకుతూ పెట్రోలియం శాఖామంత్రి సీఎం కేసిఆర్ కు లేఖ రాశారన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించిన్నప్పుడు కనీస మర్యాద ఇవ్వాలని సూచించారు. కేంద్రం నుండి నిధులు రాకపోతే కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేవారా? అని ప్రశ్నించారు.

రేపటిదినం మధ్యాహ్నం ప్రధాని మోదీ హైదరాబాదుకు రానున్నారు. భాజపా నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగతాన్ని స్వీకరించేందుకు విమానాశ్రయం బయటకు వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ లో రామగుండం వెళ్తారు. ఎరువుల ఫ్యాక్టరీ వేదిక నుండి జాతీయ రహదారులు, రైల్వే పనులకు సంబంధించిన పనులను మోదీ ప్రారంభిస్తారు. రూ. 9500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Traffic restrictions in Hyderabad tomorrow : మోదీ టూర్.. రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Exit mobile version