Site icon Prime9

Delhi Liquor Scam: 8 గంటలుగా విచారణ.. ఈడీ ఆఫీస్‌కు కవిత లీగల్‌ టీం

kavitha

kavitha

Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. 8 గంటలుగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఈడీ ఆఫీస్ కి కవిత లీగల్ టీం..

దాదాపు 8 గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఈడీ ఆఫీస్‌లోని మూడో ఫ్లోర్‌లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితం కవిత లీగల్‌ టీం ఈడీ కార్యాలయానికి చేరుకుంది.

ఈడీ పిలుపు మేరకు లీగల్‌ టీం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. సోమాభరత్‌ కుమార్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నేత దేవీప్రసాద్‌ ఈడీ ఆఫీస్‌కు వచ్చారు.

ఈడీ అడిగిన పత్రాలను వాళ్లు సమర్పించినట్లు తెలుస్తోంది.
వరుసగా రెండోరోజూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే ఐదు గంటలకు పైగా కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్‌ విధించగా.. పోలీస్‌ బలగాలు భారీగా మోహరించాయి.

ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం.

ఈడీ డైరెక్టర్ కు కవిత లేఖ

మరో వైపు లిక్కర్ స్కామ్ కేసులో తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలపై ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ‘ఈడీ చేస్తున్న తప్పుడు ఆరోపణలకు సమాధానంగా నేను వాడిన ఫోన్లను అందజేస్తున్నాను. ఒక మహిళగా తన ప్రైవసీని కూడా కాదని ఫోన్లను అందజేస్తున్నాను.’ అని కవిత లేఖలో పేర్కొన్నారు. కుట్రలో భాగంగానే దర్యాప్తు సంస్థ తనపై ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కనీసం సమన్లు ఇవ్వకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు ఈడీ ఆరోపణలు చేసిందని ప్రశ్నించారు. మార్చినెలలో తొలిసారి విచారణ కోసం ఈడీ పిలిచిందని… కానీ గత ఏడాది నవంబర్ లోనే తాను ఫోన్లను ధ్వంసం చేసినట్టు ఈడీ అధికారులు ఆరోపించడం.. ఉద్ధేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే కదా అని లేఖలో కవిత తెలిపారు.

Exit mobile version