Site icon Prime9

Health Director Dr G Srinivas Rao: కేసీఆర్ పాదాలకు ఒక్కసారి కాదు వందసార్లు మొక్కుతాను.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

Health Director

Health Director

Hyderabad: సీఎం కేసీఆర్ తనకు పితృ సమానులని ఒక్కసారి కాదు వందసార్లు మొక్కుతానని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో కొత్త మెడికల కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ కాళ్లకు నమస్కారం చేయడం పై విమర్శలు వచ్చాయి. దీని పై ఆయన కొత్తగూడెంలో ఆదివారం నిర్వహించిన వన మహోత్సవంలో వివరణ ఇచ్చారు.

బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న పాలనా దక్షుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన పాదాలు తాకడం అదృష్టంగా భావిస్తానని డీహెచ్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్ మరో బాపూజీ అన్నారు. భద్రాద్రి- కొత్తగూడెం ప్రాంతానికి సీఎం కేసీఆర్ కొత్త వైద్యశాలను కేటాయించారని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కొత్తగూడెం ప్రాంతంలో కాలేజీలు లేకపోవడం వల్ల 30 ఏళ్ల క్రితం ఎంబీబీఎస్ చేయడానికి తాను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ దాకా వెళ్లాల్సి వచ్చిందన్నారు.

ఇటీవల కాలంలో పలువురు ఉన్నతస్దాయి అధికారులు సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కడం పై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. సిద్దిపేట, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనాల ప్రారంభించిన సమయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు వెంకట్రామారెడ్డి, శరత్ సీఎం కేసీఆర్ కు అప్పట్లో పాదాభివందనం చేశారు. దీనితో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బానిసత్వానికి కేరాఫ్ గా మారిందంటూ పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Exit mobile version