Hyderabad: మెట్రో రైలు ప్రయాణీకులకు ఓ శుభవార్త. ఇప్పటివరకు ఉన్న రైళ్ల రాకపోకల వేళలను మరింత పెంచింది. రాత్రి 10.15 గంటల వరకు ఉన్న రైలు సేవలను 11 గంటల వరకు పొడిగించారు. పొడిగించిన వేళలు సోమవారం 10వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. ఉదయం ఎప్పటిలాగానే 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభమౌతాయి. ఈ మేరకు మెట్రో రైలు సంస్ధ అధికారులు పేర్కొన్నారు.
భాగ్యనగరంలో మూడు క్యారిడార్లో మెట్రో రైలు సేవలు ప్రజలకు అందబాటులో ఉన్నాయి. మియాపూర్ నుండి ఎల్బీనగర్, జేబీఎస్ నుండి ఎంజీబిఎస్, నాగోల్ నుండి రాయదుర్గం వరకు మూడు రూట్లలో 69.2 కి.మీ దూరానికి ప్రతిరోజు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. పలు మార్గాల్లోని ప్రజలు నిత్యం వేలల్లో ప్రయాణిస్తూ తమ తమ గమ్య స్థానాలకు త్వరితగతిన చేరుకొంటున్నారు.
ఇది కూడా చదవండి:వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్‌ను ప్రారంభించిన హైదరాబాద్ మెట్రో రైల్