Site icon Prime9

Hyderabad: విషాదం.. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

suicide

suicide

Hyderabad: కట్టుకున్న భర్త అకాల మరణం.. ఆ భార్యను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. తన భర్త లేని లోకంలో.. ఉండలేనని తాను తనువు చాలించింది. రోజుల వ్యవధిలోనే రెండు మరణాలు ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఈ ఘటన హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో చోటు చేసుకుంది.

గుండెపోటుతో భర్త..

కట్టుకున్న భర్త అకాల మరణం.. ఆ భార్యను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. తన భర్త లేని లోకంలో.. ఉండలేనని తాను తనువు చాలించింది. రోజుల వ్యవధిలోనే రెండు మరణాలు ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఈ ఘటన హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో చోటు చేసుకుంది.

భర్తే తన లోకం అనుకుంది.. ఏడాదిపాటు సంతోషంగా గడిపింది. కానీ భర్త అకాల మరణం.. ఆ మహిళను మానసిక క్షోభకు గురిచేసింది. ఈ హృదయ విదారకఘటన అంబర్ పేట్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాహితికి వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మనోజ్‌తో ఏడాది కిందట వివాహం జరిగింది.

వివాహం తర్వాత.. ఉద్యోగ నిమిత్తం ఇద్దరూ అమెరికా వెళ్లిపోయారు. భర్త డల్లాస్ లో ఉద్యోగం చేస్తున్నారు.

ఈ నెల 2న తల్లిదండ్రులను చూసేందుకని.. సాహితి హైదరాబాద్ వచ్చింది. అదే సమయంలో అమెరికాలో ఉన్న భర్త మనోజ్ కు గుండెపోటు రావడంతో.. మృతిచెందాడు.

వార్త తెలిసిన సాహితి.. తీవ్ర మానసిక క్షోభకు గురైంది.

ఈ నెల 23న మనోజ్ భౌతికకాయం అమెరికా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. భర్త మృతదేహాన్ని చూసి సాహితి రోదించిన తీరు అందరిని కలచివేసింది.

బుధవారం మనోత్ అంత్యక్రియలను పూర్తిచేశారు. ఆ తర్వాత అంబర్‌పేటలోని పుట్టింటికి వెళ్లిన సాహితి అక్కడ ఆత్మహత్యకు పాల్పడింది.

ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని సాహితి ఆత్మహత్య చేసుకుంది.

పది నిమిషాలు బయటకు వెళ్లి వచ్చే సరికి సాహితి ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version