Site icon Prime9

Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్ పై హై కోర్టులో విచారణ.. కౌంటర్ దాఖలు చేయాలని సూచన

Bandi sanjay

Bandi sanjay

Bandi Sanjay: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1 గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసుల రిమాండ్‌ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. 14 రోజులు రిమాండ్ విధించారు. దీనిపై భాజపా నేతలు బండి సంజయ్ రిమాండ్ ను రద్దు చేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు సూచించింది.

పోలీసులకు హైకోర్టు ఆదేశం

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1 గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసుల రిమాండ్‌ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. 14 రోజులు రిమాండ్ విధించారు. దీనిపై భాజపా నేతలు బండి సంజయ్ రిమాండ్ ను రద్దు చేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు సూచించింది. అనంతరం బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ విచారణను ఈనెల 10 కి వాయిదా వేసింది.

ప్రశ్నపత్రాల లీకేజీలో 41ఏ నోటీసు ఇవ్వకుండా బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని సంజయ్ తరపు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణ చేపట్టారు.

వరంగల్ జిల్లా కమలాపూర్‌ లో జరిగిన హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో బండి సంజయ్ ఏ1 గా ఉన్నారు. సంజయ్ పై 120 (బి), 420, 447, 505 (1)(బి) ఐపీసీ, 4(ఎ), 6, రెడ్‌విత్‌ 8 ఆఫ్‌ టీఎస్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్‌ప్రాక్టీసెస్‌) యాక్ట్‌-1997, సెక్షన్‌ 66-డి ఐటీ యాక్ట్‌-2008 కింద కేసు నమోదు చేశారు.

Exit mobile version