Site icon Prime9

Heavy Rains: మరో నాలుగు రోజులు వానలే.. హైదరాబాద్ లో ఆరెంజ్ అలర్ట్

Heavy Rains

Heavy Rains

Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ తో సహా తెలంగాణ లోని పలు జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలో ని ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మేడ్చల్ , మెదక్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇష్యూ చేసింది.

 

40 – 50 కి.మీలతో  గాలులు(Heavy Rains)

ఈ నేపథ్యంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరో వైపు హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తర దక్షిణ ద్రోణి, కింది స్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి.

 

నగరంలో దంచికొట్టిన వాన

కాగా, శనివారం తెల్లవారు జామున నుంచి హైదరబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం నుంచి భారీ వర్షం పడటంతో పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. రోడ్లపై వరద నీరు చేరడంలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, చిక్కడపల్లి, ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ, నాగారం,కీసర, జూబ్లీహిల్స్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ , చర్లపల్లి, నాంపల్లి, లక్డీకపూల్ , మాసబ్ ట్యాంక్ , మెహదీపట్నం, టోలిచౌకి, మణికొండలో భారీ వర్షపాతం నమోదైంది. పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్ నిలయం రైల్వే అండర్ పాస్ లో వర్షపు నీరు నిలిచింది.

 

 

 

Exit mobile version