Heavy Rains: మరో నాలుగు రోజులు వానలే.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎట్టకేలకు తెలుగురాష్ట్రాల్లో మొదలైన వానలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ రాత్రి నుంచి పలు చోట్ల ఆగకుండా జల్లులు కురుస్తున్నాయి.

Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎట్టకేలకు తెలుగురాష్ట్రాల్లో మొదలైన వానలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ రాత్రి నుంచి పలు చోట్ల ఆగకుండా జల్లులు కురుస్తున్నాయి. ఇక భాగ్యనగరాన్ని అయితే దట్టమైన మేఘాలు కమ్మేశాయి. అల్పపీడన ప్రభావంతో రాగల నాలుగురోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేని వానలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి హై అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి.

ఆరెంజ్ అలర్ట్(Heavy Rains)

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని అదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, కామారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. మంగళవారం నాడు రాష్ట్రంలోని 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించగా.. బుధవారం నాడు 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. బుధవారం నాడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక హైదరబాద్‌ మహానగరంలో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 28° నుండి 23°గా ఉండనున్నాయని వెల్లడించారు.

ఇక హైదరాబాద్‌లో నిన్నటి నుంచి ఎడతెరపి లేని వర్షం కారణంగా మహానగరం తడిసి ముద్దయ్యింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, కొండాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, బీఎన్‌రెడ్డి, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లిలో ప్రాంతాల్లో అర్థరాత్రి నుంచి ఆగకుండా వర్షం కురుస్తోంది. ఇక ఈ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైనే వాన నీరు నిలిచిపోవడం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పతుంది.