Harisharao: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు ఏపీలో ఓటు హక్కు రద్దు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు ఏపీలో ఓటు హక్కు రద్దు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసని ఆయన అన్నారు. తెలంగాణకు, ఏపీకి భూమికి, ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యనించారు.
అక్కడివారు ఓటు హక్కు రద్దు చేసుకొని.. తెలంగాణలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు.. తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి వారు ఓటు హక్కును ఇక్కడ నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు, దవాఖానాల పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసు. అలాంటపుడు అక్కడే ఓటు హక్కు బంద్ చేసుకోవడం ఉత్తమం అని అన్నారు. తెలంగాణ ఉంటున్న ప్రతి ఒక్కరు.. తెలంగాణ బిడ్డలేనని సీఎం కేసీఆర్ అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కార్మిక భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మేడే రోజున వీటికి శంకుస్థాపన చేస్తామన్నారు. తెలంగాణలో ఉంటున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు.