Site icon Prime9

Harish Rao: బండిసంజయ్‌ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్

Harish Rao

Harish Rao

Harish Rao:బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్ రావు బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు.

బండి వ్యాఖ్యలకు కౌంటర్.. (Harish Rao)

బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

దీనిపై స్పందించిన మంత్రి హరీశ్ రావు బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని బండి సంజయ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. అసలు ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు దీనిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

దీనికి సమాధానం చెప్పే దమ్ము బండి సంజయ్ కు ఉందా అని ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చారు.

ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని 10 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ఫసల్ బీమా పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

ఇదే విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమరే చెప్పారని తెలిపారు.

దీనిని బట్టే అర్ధం చేసుకోవాలని.. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అని మంత్రి అన్నారు. ఈ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదని అన్నారు.

పంట నష్టపోయిన రైతులకు అండగా ఉండేందుకు సుమారు రూ. 10 వేలు చొప్పున నష్టపరిహారం ప్రకటించి సీఎం కేసీఆర్‌ మరోసారి రైతు బిడ్డనని నిరూపించుకున్నారు.

కేసీఆర్ రైతులకు సాయం చేసిన విషయం.. బీజేపీ నేతలకు చిన్న విషయంలా కనిపించడం దురదృష్టకరమన్నారు. దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్న ఎక్కువ సాయం చేసినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత మాది. సాగు రైతు సంక్షేమం గురించి బీజేపీ నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ మండిపడ్డారు. అయినా బీజేపీ నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, అదాని ఆదాయాన్ని డబుల్‌ చేశారంటూ విరుచుకుపడ్డారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ..నల్ల చట్టాలను తెచ్చి రైతులను బలి చేసిన చరిత్రే మీది అని విమర్శల గుప్పించారు.

Exit mobile version