Harish Rao: ఎక్కువ మాట్లాడితే మీకే మంచిది కాదు.. ఏపీ మంత్రులకు హరీశ్ రావు కౌంటర్

Harish Rao: మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడితే మీకే మంచిది కాదంటూ కౌంటర్ ఇచ్చారు.

Harish Rao: మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడితే మీకే మంచిది కాదంటూ కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రాలో ఉన్న ఓట్లు రద్దు చేసుకోవాలని హరీశ్ రావు అన్న విషయం తెలిసిందే.

ఏపీ మంత్రులకు కౌంటర్.. (Harish Rao)

మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడితే మీకే మంచిది కాదంటూ కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రాలో ఉన్న ఓట్లు రద్దు చేసుకోవాలని హరీశ్ రావు అన్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన మంత్రులు ఇక్కడికి వచ్చి చూస్తే ఏం అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని గట్టి కౌంటర్ ఇచ్చారు.

స్వరాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా.. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండిస్తున్నామని అన్నారు. 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా ఉన్నాయన్నారు. ఏపీలో ఏమున్నాయని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. రావాల్సిన ప్రత్యేక హోదాపై ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరని అడిగారు. విశాఖ ఉక్కు ను తుక్కు కింద పెట్టినా ప్రభుత్వం నోరు విప్పి ఖండించదని విమర్శించారు.

మంత్రి హరీష్ రావు ఏపీలో రోడ్లు పరిస్థితుల గురించి వ్యాఖ్యలు చేశారు.

హరీశ్ రావు ఏమన్నారంటే..

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు.

తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు ఏపీలో ఓటు హక్కు రద్దు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసని ఆయన అన్నారు.

తెలంగాణకు, ఏపీకి భూమికి, ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యనించారు.

అక్కడివారు ఓటు హక్కు రద్దు చేసుకొని.. తెలంగాణలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు.. తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

అలాంటి వారు ఓటు హక్కును ఇక్కడ నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు, దవాఖానాల పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసు.

అలాంటపుడు అక్కడే ఓటు హక్కు బంద్ చేసుకోవడం ఉత్తమం అని అన్నారు. తెలంగాణ ఉంటున్న ప్రతి ఒక్కరు.. తెలంగాణ బిడ్డలేనని సీఎం కేసీఆర్‌ అన్నారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కార్మిక భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మేడే రోజున వీటికి శంకుస్థాపన చేస్తామన్నారు.

తెలంగాణలో ఉంటున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు.