Site icon Prime9

Gun Misfire: గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ మృతి

Gun misfired and the constable died

Asifabad: కౌటాల పోలీసు స్టేషన్ లో విషాదం చోటుచేసుకొనింది. ఓ కానిస్టేబుల్ గన్ పొరపాటున పేలింది. చికిత్స పొందుతూ ఆ కానిస్టేబుల్ మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు, టీఎస్ఎప్పీ కానిస్టేబుల్ రజనీకుమార్ కౌటాల పిఎస్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతని గన్ మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ గొంతులో దూసుకెళ్లడంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కొరకు కరీంనగర్ కు రజనీకుమార్ ను తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడు మంచిర్యాల గుడిపేట బెటాలియన్ కానిస్టేబుల్. స్వస్ధలం బెల్లంపల్లి మండలం బట్టుపల్లి గ్రామం కాగ, సెంట్రీ డ్యూటీలో ఉన్న సమయంలో వేకువ జామున ఈ ప్రమాదం చోటుచేసుకొనింది. పోలీసులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం పలు ప్రాంతాల్లో సీసీ కెమరాలను ఏర్పాటు చేసింది. కాని ఏ పోలీసు స్టేషన్ నందు సీసీ కెమరాల ఏర్పాటు పెద్దగా లేదు. దీంతో వాస్తవానికి ఆయా పీఎస్ ల పరిధిలో ఏం జరుగుతుందో తెలుసుకొనే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. స్టేషన్ ఇన్ చార్జ్ చెప్పిందే కేసులో వ్రాసుకొనే పరిస్ధితి అడపా దడపా ఏర్పడుతుంది.

ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: వందేభారత్ రైలులో ప్రయాణించిన మజ్లిస్ పార్టీ అధినేత ఓవైసీ.. రాళ్లు రువ్విన దుండగులు

Exit mobile version