Site icon Prime9

Tamilisai: గవర్నర్ వ్యవహారం.. కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

Tamilisai

Tamilisai

Tamilisai:: తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్- రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. వీరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా విభేదాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. ఇక పెండింగ్ బిల్లుల విషయంలో గవర్నర్ తీరుపై కీలక పరిమాణం చోటు చేసుకుంది.

సుప్రీం కోర్టు నోటీసులు.. (Tamilisai)

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్- రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. వీరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా విభేదాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. ఇక పెండింగ్ బిల్లుల విషయంలో గవర్నర్ తీరుపై కీలక పరిమాణం చోటు చేసుకుంది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దగ్గర ఉన్న పెండింగ్‌ బిల్లులపై విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విషయంలో తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పది బిల్లులను గవర్నర్ తనవద్దే ఉంచుకొని కాలయాపన చేస్తున్నారు.

అయితే వాటిని త్వరగా ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. గవర్నర్ వద్దకు పంపిన బిల్లులను.. ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేయాలి.
రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం.. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్‌ ముద్ర పడాల్సి వేయాల్సి ఉంటుంది. కానీ ఇలాంటివి చేయకుండా.. వాటిని పెండింగ్ లో ఉంచుతున్నారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ఇక ఈ పిటిషన్‌లో గవర్నర్‌ తో పాటు గవర్నర్‌ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా ప్రభుత్వం చేర్చింది.

రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్‌కు తాము నోటీసులు జారీ చేయలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

కాకపోతే.. ఆలస్యంపై వివరణ కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసే వీలుందని చెబుతూ ఇవాళ నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలో.. కేంద్రం తరపున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా కలుగుజేసుకుని తెలంగాణ గవర్నర్‌ నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని బదులిస్తానంటూ ధర్మాసనాన్ని కోరారు.

అయినప్పటికీ సుప్రీం కోర్టు ధర్మాసనం.. కేంద్రానికి నోటీసులు జారీ చేయడం గమనార్హం. మార్చి 27వ తేదీ సోమవారం ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరగనుంది.

Exit mobile version