Inter Results: ఇంటర్ పరీక్ష ఫలితాలు.. కొందరు విద్యార్ధులను మానసికంగా కుంగదీస్తున్నాయి. మరికొందరు మార్కులు తక్కువ వచ్చాయని కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు నాలుగు చోటు చేసుకున్నాయి. ఈ పరీక్షల భయం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది.
నలుగురు ఆత్మహత్య..
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. కొందరు విద్యార్ధులను మానసికంగా కుంగదీస్తున్నాయి. మరికొందరు మార్కులు తక్కువ వచ్చాయని కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు నాలుగు చోటు చేసుకున్నాయి. ఈ పరీక్షల భయం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది.
నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెంది పలువురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన జాహ్నవి అనే విద్యార్ధి సెకండ్ ఇయర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో.. ఆత్మహత్య చేసుకుంది.
మరో ఘటనలో వనస్థలిపురంలో నివసించే.. గాయత్రి అనే విద్యార్ధి కూడా ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడింది. హస్తినాపురం నవీన కళాశాలలో అక్కాచెల్లెల్లు చదవుతుండగా .. చెల్లి పాస్ అయి తాను ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది.
ఖైరతాబాద్‌లోని ఇదే తరహాతో ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గౌతమ్ కుమార్ అనే విద్యార్ధి బైపీసీలో ఫెయిల్ అయ్యాడు. దీంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
మణికొండలో మరో విద్యార్దిని ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షలో ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్తాపం చెంది ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది.
సికింద్రాబాద్‌లో మరో విద్యార్ధి తనువు చాలించాడు. ఒక సబ్జెక్టు తప్పడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు.