Accident:హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కచెల్లెళ్లు సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. మృతులు నిజాంపేట్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఓ బ్యాచిలర్ పార్టీకి వెళుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఘోర ప్రమాదం..
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కచెల్లెళ్లు సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. మృతులు నిజాంపేట్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఓ బ్యాచిలర్ పార్టీకి వెళుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నార్సింగి శివారులో రోడ్డు పక్కన నిలిపిన టిప్పర్ ను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో.. నలుగురు మృతిచెందగా మరికొందరికి గాయాలయ్యాయి. ఈ కారులో అక్కచెల్లెళ్లు అర్షిత, అంకితతో పాటు వారి స్నేహితులు నితిన్, అమృత్, మరికొందరు ఉన్నారు. ఘటనాస్థలంలోనే అక్కచెల్లెళ్లు, నితిన్ మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమృత్ చనిపోయాడు. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిజాంపేట్‌కు చెందిన వీరు.. బ్యాచిలర్ పార్టీ నిమిత్తం గండీపేట్ వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నారు. శంకర్‌పల్లి మీదుగా మీతిమిరిన వేగంతో వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కారు అదుపుతప్పి.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కారులో ఇరుక్కున్న మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.