Site icon Prime9

Falaknuma Express: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. దగ్ధమైన మూడు బోగీలు

falaknuma express

falaknuma express

Falaknuma Express: ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. కాగా తాజాగా ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలు.. తెలంగాణలోని యాదాద్రి జిల్లా పగిడిపల్లిలోకి రాగానే ఒక్కసారిగా ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో ఎస్ 4, ఎస్5, ఎస్ 6 బోగీలు పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమయ్యాయి. కాగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడ్డాయి. రైల్లో పొగలు రావడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది లోకోపైలెట్ కు సమాచారం అందించారు. దీనితో వెంటనే స్పందించిన లోకోపైలెట్ రైలును నిలిపివేయడంతో ప్రయాణకులంతా పరుగు పరుగున రైలు నుంచి దిగిపోయారు. దీనితో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి.

నాలుగు బోగీలు దగ్దం(Falaknuma Express)

ఈ రైలు ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అటు ప్రయాణికులు ఇటు రైల్వే సిబ్బంది అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం దట్టంగా అలుముకున్న మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించాయి. ఇప్పటి వరకు 4 బోగీలు కాలి దగ్ధమయ్యాయి. సంఘటన స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది బోగీల మధ్య లింక్‌ను వేరు చేసి, రైలును కాస్త ముందుకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాద స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి, పగిడిపల్లి మధ్య నిలిచిపోయింది.

ఇదిలా ఉంటే మరోవైపు రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ సంఘటన స్థలికి బయల్దేరారు వెళ్లారు. ప్రమాద స్థలం నుంచి ఆర్డీవో భూపాల్‌రెడ్డి రైల్వే అధికారులు, అగ్నిమాపక అధికారులతో సంప్రందింపులు జరుపుతున్నారు. ఈ మంటలు రైలు మొత్తం వ్యాపించకుండా బోగీల లింక్‌ను తప్పించం వల్ల మిగతా బోగీలకు మంటలు అంటుకునే అవకాశం లేదని ఆయన తెలిపారు.

ఇక మరోవైపు ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులంతా ఓ వైపు ప్రాణాలు మిగిలియి దేవుడా అనుకుంటూనే మరోవైపు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ సామగ్రి అంతా రైలులోనే ఉండిపోయి కాలిబూడిదైపోయిందని ఆవేదన చెందుతున్నారు. మరికొందరు ప్రయాణికులు అయితే ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని ప్రాణాలు కాపాడుకునే క్రమంలో బయటకు పరుగుతీశాము కానీ తమ సర్టిఫికెట్లన్నీ రైలులో ఉండిపోయాయంటూ కొందరు కన్నీరుపెట్టుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Exit mobile version