Site icon Prime9

Peddapalli: పెద్దపల్లిలో దారుణం.. కన్నకూతుర్ని గొడ్డలితో నరికిచంపిన తండ్రి

shocking murder case happened in bihar

shocking murder case happened in bihar

Peddapalli:పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతుర్ని ఓ తండ్రి కిరాతకంగా.. గొడ్డలితో నరికిచంపాడు. ఆ తర్వాతే మరో వ్యక్తిపై హత్యయత్నానికి తెగబడ్డాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిందితుడిని తమకు అప్పగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దారుణ హత్య..

పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతుర్ని ఓ తండ్రి కిరాతకంగా.. గొడ్డలితో నరికిచంపాడు. ఆ తర్వాతే మరో వ్యక్తిపై హత్యయత్నానికి తెగబడ్డాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిందితుడిని తమకు అప్పగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఘటన మంథని మండలం బట్టుపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన గుండ్ల సదానందం.. 11 ఏళ్ల కూతుర్ని గొడ్డలితో కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను గొడ్డలితో నరికి.. ఆ తర్వాత అదే గొడ్డలితో మరో దుకాణదారుడిపై దాడికి తెగబడ్డాడు. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సదానందం గతంలో తన భార్యను ఉరి వేసి హత్య చేశాడు. ఈ కేసులో జైలుకి వెళ్లి వచ్చాడు. ఇప్పుడు కూతుర్ని కూడా చంపి మరో వ్యక్తిపై హత్యాహత్నానికి పాల్పడ్డాడు. నిందితుడి తీరు పట్ల గ్రామంలో.. ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సందానందంను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. నిందితుడిని తామే శిక్షిస్తామని.. పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తోపులాట కూడా జరిగి గ్రామస్థుల ఆగ్రహంతో పోలీస్ వాహనంపై దాడి చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

Exit mobile version