Etela Rajender: సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే.. ఈటల రాజేందర్ డిమాండ్

Etela Rajender: ప్రశ్నపత్రాల లీకేజీపై ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. మా నౌకరీలు మాకు కావాలే అనే నినాదంతో భాజపా తలపెట్టిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.

Etela Rajender: ప్రశ్నపత్రాల లీకేజీపై ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. మా నౌకరీలు మాకు కావాలే అనే నినాదంతో భాజపా తలపెట్టిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.

ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు (Etela Rajender)

ప్రశ్నపత్రాల లీకేజీపై ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. మా నౌకరీలు మాకు కావాలే అనే నినాదంతో భాజపా తలపెట్టిన దీక్షలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మూడు తరాల ఉద్యమ చేసిందని తెలిపారు.

ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో చార్మినార్ వద్ద ఆనాటి విద్యార్థులపై తూటాలు పేల్చితే 7 గురు విద్యార్థులు మరణించారని ఆయన వివరించారు.

ఏపీ పాలన విముక్తి కోసం.. నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో ఉద్యమించామని ఆయన వెల్లడించారు.

తెలంగాణ వచ్చాక లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఈటల అన్నారు. అవన్నీ ఇప్పటి వరకు భర్తీ చేయలేదని గుర్తు చేశారు.

ఆనాడు ఏ ఉద్యోగాలొస్తాయని సంబురపడ్డమో.. వాటి సంగతి అటుంచితే ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు.

జీహెచ్ఎంసీ ఉద్యోగులు.. ఆర్టీసీ కార్మికులు.. సింగరేణి కార్మికుల మృతికి ప్రభుత్వం కారణమైందన్నారు.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండొద్దని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ వాటిని రద్దు చేయకపోగా.. ప్రభుత్వ శాఖలన్నింటిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనే నియమించారు.

చివరకు టీఎస్పీఎస్సీలో కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారంటే ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉందా? అని ప్రశ్నించారు.

గత 4 ఏళ్లలో 11 వేల కు మించి ఉద్యోగాలను కూడా భర్తీ చేయని కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చదువుకున్న పిల్లలంతా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారనే భయంతో ఎన్నికల ఏడాది వస్తున్నందున వాళ్లంతా కోచింగ్ సెంటర్లలో బిజీగా ఉండాలని నోటిఫికేషన్లు ప్రకటించారే తప్ప వాళ్లపై ప్రేమతో కాదన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలని డిమాండ్ చేశారు.