Site icon Prime9

ED Raids : హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు.. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు

ED Raids on malineni sambasivarao house and properties

ED Raids on malineni sambasivarao house and properties

ED Raids : హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. 15 బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాంబశివరావు నివాసం, కార్యాలయంతో పాటు పలువురి నివాసాల్లో సోదాలను చేపడుతున్నట్టు సమాచారం అందుతుంది. కాగా ప్రస్తుతం కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రాటెక్, ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, ట్రాన్స్ ట్రై రోడ్ ప్రాజెక్టులకు మాలినేని సాంబశివరావు డైరెక్టర్ గా ఉన్నారు.

అయితే వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఈ సంస్థలు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు కూడా అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్ట ప్రాంతాలలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version