Site icon Prime9

MLC Kavitha: ఈడీ నోటీసులు ఇవ్వలేదు.. కవిత

ED notice are not gave, say's kavitha

ED notice are not gave, say's kavitha

Hyderabad: ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ మీడియాపై ధ్వజమెత్తారు. ఊహించుకొని వ్రాయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న కొంతమంది తప్పు దోవ పట్టించేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే వారు ఎవరనేది ఆమె ట్విట్టర్ లో స్పష్టం చేయలేదు. సమయాన్ని వృధా చేసుకోకుండా, నిజాలను ప్రసారం చేయాలని కవిత మీడియాకు విజ్నప్తి చేశారు. వీక్షకులు సైతం ఈ విషయాన్ని పట్టించుకోవద్దని పేర్కొంటూ అసలు సిసలు రాజకీయవేత్తలను ఆమె తలపించారు.

కరోనా పాజిటివ్ కారణంగా ఇంట్లో వున్న కవిత అందుబాటులో లేకపోవడంతో ఆమె సిబ్బందికి నోటీసులు అందిచిన్నట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు బీజేపి నేతలు కొంతమంది కేటీఆర్, కవితలకు కరోనా పాజిటివ్ ఎందుకొచ్చింది అంటూ ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేసివున్నారు. మొత్తం మీద ఢిల్లీ మద్యం స్కాం చిన్నగా కవిత చుట్టూ తిరగడం పై తమ పార్టీ నేతలు ఎక్కడా కూడా స్పందించ వద్దంటూ టిఆర్ఎస్ అధినేత నుండి కూడా ఆదేశాలు వెళ్లిన్నట్లు ప్రచారం సాగుతుంది.

 

Exit mobile version