Site icon Prime9

Dr. Rammurthy as Director of NIMS: నిమ్స్ డైరెక్టర్ గా డాక్టర్ రామ్మూర్తికి అదనపు బాధ్యతలు

Dr. Rammurthy as Director of NIMS

Dr. Rammurthy as Director of NIMS

Hyderabad: నిజాం ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ గా డాక్టర్ ఎస్. రామ్మూర్తికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన నిమ్స్ డీన్ గా ఉన్నారు. నెల రోజుల పాటు ఆయన డైరెక్టర్ హోదాలో అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ మనోహర్ మెడికల్ గ్రౌండ్స్ పై సెలవులో ఉన్నారు. దీంతో డీన్ కు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 2నుండి అక్టోబర్ 2వరకు అదనపు బాధ్యతలు ఆయన నిర్వహించనున్నారు.

Exit mobile version