Site icon Prime9

Double Decker Buses: భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు.. కాలుష్య రహితంగా

Double decker buses in Bhagyanagar!

Hyderabad: భాగ్యనగరవాసులకు అలనాటి తీపి గుర్తులు తిరిగి అందబోతున్నాయి. ప్రభుత్వ రధచక్రాలు టీఎస్ఆర్టీసి అందుకు సన్నహాలు చేస్తుంది. కాలుష్య రహితంగా, సుందరమైన ఆకృతిలో డబుల్ డెక్కర్ బస్సులు ట్విన్ సిటీస్ రహదారుల్లో కనువిందు చేయనున్నాయి. సమాచారం మేరకు,

ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ప్రధాన మార్గాలైన 218 పటాన్ చెరు-కోఠి, 9ఎక్స్ జీడిమెట్ల-సీబీఎస్, 118 అఫ్జల్ గంజ్-మెహిదీపట్నం రూట్లలో కాలుష్య రహిత బస్సులను తొలిదశలో ప్రయాణించనున్నాయి.

వీలైనంతవరకు ఫ్లైఓవర్ లేని మార్గాలకు ఆర్టీసి ప్రాధాన్యత ఇస్తుంది. బస్సుల కొనుగోళ్లకు సంబంధించిన నిధుల కేటాయింపుల పై ప్రభుత్వంతో ఆర్టీసి సంప్రదింపులు చేస్తోంది. ఈ క్రమంలోనే తొలుత కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేటు డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకొనిరావాలని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు నేటి నుంచి వైద్యపరీక్షలు

Exit mobile version