Site icon Prime9

HCA: ఆఫ్ లైన్ టిక్కెట్లు అయిపోయాయి.. వెల్లడించిన హెచ్సీఏ

Cricket Offline Tickets sold out, HCA reveals

Cricket Offline Tickets sold out, HCA reveals

Hyderabad: ఎట్టకేలకు హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ లైన్ టిక్కెట్లు అయిపోయాయని ప్రకటించింది. ఆన్ లైన్ టిక్కెట్లను ఈ రోజు రాత్రి 7 గంటల తర్వాత అందుబాటులో ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు.

ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. ఈ నేపధ్యంలో టిక్కెట్ల కొనుగోలు చేసేందుకు వేల సంఖ్యలో జింఖానా గ్రౌండ్ వద్ద బారులు తీరారు. భారీగా క్రికెట అభిమానులు గ్రౌండ్ వద్దకు చేరుకోవడంతో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరిగింది. ఘటనలో పలువురు అభిమానులు లాఠీచార్జ్ భారిన పడ్డారు. మరికొందరు సృహ తప్పి పడిపోయారు. మృతి చెందిన్నట్లు భావించిన మహిళ పరిస్ధితి ఆసుపత్రిలో కోలుకుంటుందని పోలీసులు పేర్కొన్నారు.

టిక్కెట్ల అమ్మకాల వ్యవహారం పై టీఆర్ఎస్ పార్టీ గరం గరం అయింది. సంబంధిత వ్యక్తులు తన కార్యాలయానికి రావాలంటూ ఓ మంత్రి పేర్కొనడం బట్టి చూస్తే రాజకీయ వేదికగా హెచ్సీఏ తయారైందని ప్రజలు బాహాటంగానే చర్చించుకొంటున్నారు.

Exit mobile version