Site icon Prime9

Preethi Case: ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్.. సీపీ సంచలన ప్రకటన

preeti 1

preeti 1

Preethi Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఈ పోస్ట్ మార్టం నివేదికను.. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ మీడియాకు వెల్లడించారు. ప్రీతిది ఆత్మహత్యేనని సీపీ ప్రకటించారు.

ప్రీతిది ఆత్మహత్యే..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఈ పోస్ట్ మార్టం నివేదికను.. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ మీడియాకు వెల్లడించారు. ప్రీతిది ఆత్మహత్యేనని సీపీ ప్రకటించారు.

కాకతీయ మెడికల్‌ విద్యార్ధిని ధారవత్ ప్రీతి నాయక్ మృతి కేసులో ఉత్కంఠ వీడింది. ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్లు.. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది. ఈ మేరకు పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ ను మీడియాకు సీపీ వెల్లడించారు. ఈ ఆత్మహత్యకు సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ ప్రధాన కారణమని వివరించారు.

పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో ప్రీతి ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకున్నట్లు తేలిందన్నారు. ఐపీసీ సెక్షన్‌ 306 కింద చర్యలు తీసుకుంటున్నాం. ప్రీతి ఆత్మహత్య కు సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ప్రధాన కారణం. వారం పదిరోజుల్లో చార్జి షీట్ దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్‌ తెలిపారు.

ఇదిలా ఉంటే.. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్‌కు వరంగల్‌ కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య 16వారాల పాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని సైఫ్‌ బెయిల్‌ ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు.

కాగా ప్రీతి ఆత్మహత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం లేపింది. ఈ ఘటనపై విపక్షాలు భారీ ఎత్తున ఆందోళన చేశాయి. ఈ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేటీఆర్ కూడా స్పందించారు. ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టమని బహిరంగంగానే చెప్పారు.

 

Exit mobile version
Skip to toolbar