Site icon Prime9

Komatireddy Venkat Reddy : నేను వెళ్లి ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Venkat Reddy

Venkat Reddy

Komatireddy Venkat Reddy  : తాను వెళ్లి ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలిచే పరిస్దితిలో లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెంకటరెడ్డి అక్కడ ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తానునుగోడులో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసినా ఉపయోగం లేదన్నారు. ప్రచారం చేసినా వస్తే 10 వేల ఓట్ల వరకు వస్తాయని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా ఓడిపోతుందని తెలిసి, ప్రచారం చేయడంలో అర్థం లేదని వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియాలో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు.

ఓడిపోయే పార్టీకి ప్రచారం చేయడమెందుకని వెంకటరెడ్డి ప్రశ్నించారు. రెండు అధికార పార్టీలు కొట్లాడుతున్నప్పుడు మనమేం చేయగలమని అన్నారు. పాదయాత్ర చేద్దామని అనుకున్నానని.. కానీ కాంగ్రెస్‌లో ఒక్కొక్కరిది ఒక్కొక్క గ్రూప్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫైనాన్సియల్ గా చాలా బలహీనంగా ఉందని.. తాను ప్రచారానికి వెళ్తే డబ్బులు ఎవరు పెట్టాలని ప్రశ్నించారు. 25 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని.. ఇక చాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం కాంగ్రెష్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానాన్ని కోరుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో నిలవగా, తమ్ముడికి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రెండురోజులకిందట రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేయాలని, మద్దతు తెలపాలని కాంగ్రెస్ నేతలకు వెంకటరెడ్డి ఫోన్ చేసి మాట్లాడారని ఆడియో టేపు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. తాజాగా ఆస్ట్రేలియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయి.

Exit mobile version